ETV Bharat / state

జడ్పీ సమావేశంలో అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు - manchirial updates

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన జిల్లాపరిషత్ సమావేశంలో అధికారులను ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. మిల్లర్లు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.

ZP meeting manchiryal dist mandamarri town
జడ్పీ సమావేశంలో అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు
author img

By

Published : Nov 12, 2020, 10:08 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రిలో జిల్లా పరిషత్‌ సమావేశం వాడివేడిగా సాగింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గ చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. రైతుల సమస్యలపై అధికారులను నిలదీశారు. గతంలో తేమ పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంటే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యాన్ని తరలించేందుకు లారీలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నలు పడిగాపులు పడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సీజన్‌లోనైనా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారంటూ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ మండిపడ్డారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, ఇన్‌ఛార్జ్ పాలనాధికారి సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ త్రిపాఠి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్ర మంత్రులు సత్యవతి, పువ్వాడల భద్రాచలం పర్యటన రద్దు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.