మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి మందిర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్పీ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ సరోజ పాల్గొన్నారు. మహిళలంతా అమ్మవారికి పూజలు చేసి... సాంప్రదాయబద్ధంగా గోరింటాకు తెచ్చి నూరి చేతులకు పెట్టుకున్నారు. ఇలా అందరూ ఒకచోటు కలిసి పండుగ చేసుకున్నారు. గోరింటాకు ప్రయోజనాలను నేటి తరానికి పరిచయం చేస్తున్నామని జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.
గోరింటాకు వేడుకల్లో జడ్పీ ఛైర్పర్సన్ - mehendi
ఆనందంతో పాటు ఆరోగ్యం కోసం ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవాల్సిందే అంటున్నారు మహిళలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోరింటాకు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.