మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువనున్న శ్రీరాం సాగర్, కడెం జలాశయాల నుంచి వరద నీరు వచ్చి ఎల్లంపల్లిలో చేరుతోంది.
148 మీటర్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి 147.72 మీటర్ల వరకు వరద నీరు చేరింది. 30 వేల 579 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వస్తుండగా.. 37 వేల 668 క్యూసెక్కుల నీటిని 6 గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.