ETV Bharat / state

ఆన్​లైన్​ యాప్​లో పరిచయం అయ్యాడు, రూ.7.50 లక్షలు దోచుకున్నాడు - 7 లక్షల రూపాయల ఆన్​లైన్​ మోసం

Woman Loses RS 7 Lakhs Online App Fraud in Hanumakonda : ఆన్​లైన్​ యాప్​ ద్వారా పరిచయం అయిన గుర్తు తెలియని వ్యక్తికి, ఓ మహిళ రూ.7.50 లక్షలను అతని ఖాతాలో వేసింది. అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 12 మంది మహిళలు దగ్గర సుమారు రూ.6 లక్షలను దోచుకున్నాడు ఓ మోసగాడు. ఈ రెండు సంఘటనలు హనుమకొండ, మంచిర్యాల జిల్లాల్లో జరిగాయి.

Woman Loses RS 7 Lakhs Online App Fraud in Hanumakonda

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 6:42 PM IST

Woman Loses RS 7 Lakhs Online App Fraud in Hanumakonda : ఈ మధ్యకాలంలో ఆన్​లైన్​ మోసాలు(Online Fraud) ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్రపోయే వరకు ఎన్నో ఆన్​లైన్​ ప్రాండ్​లను చూస్తున్నాము. అలాగే ఉద్యోగాల పేరుతో అమాయకమైన వారిని అక్రమార్కులు నిండా ముంచుతున్నారు. అయితే తాజాగా హనుమకొండ, మంచిర్యాల జిల్లాల్లో ఈ తరహా ఘటనలే జరిగాయి.

మహిళను నమ్మించి ఆన్​లైన్​ యాప్(Online App)​ ద్వారా రూ.7.50 లక్షల నగదును హైదరాబాద్​కు చెందిన యువకుడు తన ఖాతాలోకి బదిలీ చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ గాంధీనగర్​కు చెందిన మహిళ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బ్యాంక్​ ఖాతాలో కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకుంటుంది. ఈ క్రమంలో 'నీతో' యాప్​ ద్వారా హైదరాబాద్​కు చెందిన వసంత్​ పరిచయం అయ్యాడు.

Online Fraud : ఇలా వారివురు వాట్సప్​ ఛాటింగ్(Whats App)​ చేసుకుంటు ఉన్నారు. తనకు ఎవరూ లేరని ఒంటరిగా ఉంటున్నానని ఆమెను వసంత్​ నమ్మించసాగాడు. అదే విధంగా తనకు డబ్బులు అవసరం ఉందని చెప్పాడు. ఆ డబ్బులు అనేవి ఇవ్వకుంటే చనిపోతానని మహిళను బెదిరించాడు. అతడి మాటలు నమ్మిన ఆమె అవసరం ఏమోనని తొలిసారి రూ.25 వేలు డబ్బును అతని ఖాతాకు పంపించింది. ఇంకా కావాలంటే దశలవారీగా ఆరు నెలలో రూ.7.50 లక్షలు పంపించింది. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని ఆమె అతడిపై ఒత్తిడి తేవడంతో వసంత్​ మొబైల్​ను స్వీచ్​ ఆఫ్​ చేసేశాడు. చివరి ఆమె చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

BTech Student Committed Suicide : ఉద్యోగం పేరిట మోసం.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాలలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం : మరోవైపు మంచిర్యాల​ జిల్లాలో ఉద్యోగాల పేరుతో 12 మంది మహిళలను మోసం(Job Fraud) చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని నస్పూర్​కు చెందిన 12 మంది మహిళలకు జిల్లా కలెక్టరేట్​ కార్యాలయంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వినోద్​​ అనే వ్యక్తి మోసం చేశాడు. ఆ మహిళల వద్ద నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేలు చొప్పున తీసుకున్నాడు. గుర్రం శ్రీనివాస్​ అనే వ్యక్తికి అక్షర ఏజెన్సీ టెండర్​ వచ్చిందని అందుకు ఒక్కొక్కరు రూ.50 వేలు ఇవ్వాలని వినోద్​ అనే వ్యక్తి ఈ డబ్బులు వసూలు చేశారని బాధిత మహిళలు తెలిపారు. తీరా ఉద్యోగాలు లేకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. వెంటనే తాము మోసపోయామని గ్రహించి నస్పూర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

BED College Principal Fraud in Vikarabad : బీఎడ్‌ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌ రూ.39 లక్షల కుంభకోణం.. ఎలా జరిగిందంటే..!

మహా జాదుగాడు - ఏకంగా పోలీసుల నుంచే డబ్బులు వసూలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.