ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన సదస్సు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని భవిత డిగ్రీ కళాశాలలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన సదస్సు జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ ఆసిస్టెంట్ రాజలింగు విద్యార్థులకు ఓటు హక్కు గురించి వివరించారు. ఓటర్లందరూ ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని అందుకు యువ ఓటర్లు ముందుకు రావాలని ప్రిన్సిపల్ కన్నారావు కోరారు. మంచి గుణాలున్న నాయకుడిని ఎన్నుకుంటామని విద్యార్థులు తెలిపారు.ఇవీ చూడండి :నూలునిచ్చిన మిల్లే... నేతలనిచ్చింది