తెలంగాణ పశ్చిమ బంగ కాదని... ఉద్యమాలకు నెలవైన గడ్డ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల చేతుల్లో బందీగా మారిందని మంత్రి తెలిపారు. తెరాస ప్రభుత్వం తన ధోరణి మార్చుకోవాలన్నారు. కార్యకర్తలంతా దేశ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ పాల్గొన్నారు.
ఇవీచూడండి: నిఘా నీడలో హుజూర్నగర్