మంచిర్యాల జిల్లా మందమర్రిలో అర్ధరాత్రి రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ సింగరేణి కార్మికవాడల్లో తిరుగుతూ బందోబస్తును పరిశీలించారు. అనవసరంగా రహదారులపై తిరుగుతున్న పలువురిని మందలించి చెదరగొట్టారు. మందమర్రి పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పోలీసులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని సీపీ సత్యనారాయణ అన్నారు.
ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు