మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీరాంపూర్ సింగరేణి అతిథిగృహంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా ఆరోగ్యం, సంక్షేమంపై జిల్లా అధికారులతో ఆయన చర్చించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భర్తీ కాకపోవడం వల్ల ఇబ్బందులు..
జిల్లాలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. కొన్ని శాఖల్లో పోస్టులు భర్తీ కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: పాలు వద్దంటున్నారా..? రుచిగా.. అందించేద్దామిలా!