ETV Bharat / state

ఉచితంగా పిచికారి యంత్రాలు... కాలనీల్లో స్ప్రే - మంచిర్యాల పురపాలక ఛైర్మన్ రాజయ్య

మంచిర్యాల పురపాలక పరిధిలోని 29వ వార్డులో కరోనా వైరస్ నియంత్రణ కోసం పిచికారి యంత్రాల ద్వారా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. పలు కాలనీల్లో కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు.

Spray machine for free Spray in colonies in mancherial
ఉచితంగా పిచికారి యంత్రాలు... కాలనీల్లో స్ప్రే
author img

By

Published : Apr 13, 2020, 1:15 PM IST

మంచిర్యాలలోని పలు వార్డుల్లో కొవిడ్​-19 వ్యాధి నివారణ కోసం పిచికారి యంత్రాలతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లారు. మంచిర్యాల పురపాలక ఛైర్మన్ రాజయ్య, వార్డు కౌన్సిలర్ చైతన్య రెడ్డి ఆ యంత్రాన్ని ప్రారంభించారు. యూపీఎల్ సంస్థ పిచికారి యంత్రాలను ఉచితంగా సమకూర్చిందని ఆయన అన్నారు. కాలనీలోని వాడవాడల్లో ఆ ద్రావణాన్ని పిచికారి చేశారు.

ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలో అదృష్టవశాత్తు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా పరిశుభ్రత పాటిస్తున్నామన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో వైరస్ నియంత్రణ ద్రావణాలను చల్లుతున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు.

ఇదీ చూడండి : చిట్టీ వసూళ్ల పేరుతో వేధింపులు వద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.