ముంబయికి చెందిన మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ సంస్థ సెప్టెంబర్1న జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యంత పొదుపుగా నీటిని వినియోగిస్తున్నందుకు ఆ సదస్సులో ఈ అవార్డును ప్రకటించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో సీఎండీ ఎన్.శ్రీధర్...ఈఎండీ డైరెక్టర్ డి.సత్యనారాయణ రావుకు ఈ అవార్డును అందజేశారు.
సాధారణంగా 500 మెగావాట్లు అంతకు ఎక్కువ స్థాయి గల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒక మెగా వాట్ విద్యుత్ ఉత్పాదనకు 3క్యూబిక్ మీటర్ల వరకు నీటిని వినియోగించవచ్చని కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ.. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వల్ల 2.3 క్యూబిక్ మీటర్ల నీటిని మాత్రమే వినియోగించింది. ఇందుకు గాను మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఈ ప్రత్యేకతను గుర్తిస్తూ.. దక్షిణ భారత దేశంలోనే 500 మెగావాట్లు, అంతకు మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యంత పొదుపుగా నీటిని వాడుతున్న సంస్థగా ఎస్టీపీసీని గుర్తించి అవార్డును ప్రకటించారు.
ఇదీ చదవండి: