కర్నల్ సంతోష్‌బాబు దేశం కోసం వీర మరణం పొందిన గొప్ప యోధుడని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా నుంచి తెరాస శ్రేణులు శాంతి ర్యాలీ నిర్వహించారు. భారత్-చైనా మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణల్లో అమరులైన జవాన్లకు నివాళిగా ఐబీ చౌరస్తాలో చైనా జాతీయ పతాకాన్ని దగ్ధం చేశారు.
దేశ ప్రజలంతా చైనా వస్తువులను బహిష్కరించాలని అప్పుడే జవాన్లకు సరైన నివాళి అర్పించినట్లని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పించి శత్రువులను దీటుగా ఎదుర్కొన్నారని కర్నల్ సంతోష్‌బాబును కొనియాడారు. జవాన్ల ప్రాణత్యాగం దేశాన్ని ఎంతగానో కలచివేసిందని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీచూడండి: సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ విఠల్ కన్నుమూత