ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మంచిర్యాల జిల్లా మందమర్రి రాష్ట్రీయ రహదారిపై భాజపా ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకొని వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి: ఏడోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె