మంచిర్యాల జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబసభ్యులు రంగులు చల్లుకుంటూ కేరింతలతో సంబురాలు జరుపుకున్నారు. స్థానిక రాజస్థానీలు పాటలు పాడుతూ హోలీ ఆడారు.మహిళలు ప్రత్యేక నృత్యాలు చేస్తూ వేడుకలు చేసుకున్నారు. ప్రజలందరి జీవితాలు రంగుల మయం కావాలని మార్వాడీ సమాజ్ ప్రతినిధి పవన్ ఆకాంక్షించారు.
ఇవీ చూడండి :ఆదిలాబాద్ జిల్లా గులాబీ గూటిలో రగులుతున్న అసమ్మతి