ప్లాస్టిక్‌ను తరిమికొట్టడం మన చేతుల్లోనే ఉందని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో గజేల్లి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయని చెప్పారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలంతా గన్నీ సంచులను వాడితే మంచిదని తెలిపారు. ప్లాస్టిక్ ను ఉత్పత్తి చేసే సంస్థలను మూసివేయడం కంటే... ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం సులువని సబ్ కలెక్టర్ చెప్పారు. అక్టోబర్ 2న ప్లాస్టిక్ నిషేధంపై మున్సిపాలిటీతో పాటు డివిజన్లోని పంచాయతీల్లో తీర్మానాలు చేస్తామన్నారు. అక్టోబర్ 15 నుంచి ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు, పర్యావరణ ఏఈ హరికాంత్, గజెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం ...