మంచిర్యాలకు చెందిన విశ్రాంత ప్రభుత్వ వైద్యుడు చంద్రశేఖర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఈ ఏడాది జూన్ 11న మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ దాదా, అతని భార్య నర్మద అలియాస్ కృష్ణకుమారితో సత్సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఆకస్మిక తనిఖీలు చేశారు. చంద్రశేఖర్ ఇంట్లో ఓ మావోయిస్టు నేత మాట్లాడిన సీడీ, జనతా సర్కార్ పుస్తకం, మావోయిస్టు వార్తలు వచ్చిన పత్రికలు, రూ. 27 వేలు, చరవాణిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది డిసెంబర్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నర్మదా అలియాస్ కృష్ణకుమారి వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిందని... ఆమె పేరు నిర్మల కుమారి అని తెలిపిందని చంద్రశేఖర్ తెలిపారు. ప్రాథమిక వైద్యం అందించి హైదరాబాద్‌లోని ఎన్ఎంజీ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం కోసం వెళ్లాలని సూచించినట్లు అధికారులకు చంద్రశేఖర్ తెలిపారు.
ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్‌వాక్ చేస్తూ విద్యార్థిని మృతి!