తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ- 3 సింగరేణిగనిపై వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మికులంతా కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యమ సమయం నుంచి కార్మికుల సంక్షేమం కోసం తమ గౌరవ అధ్యక్షురాలిగా కృషి చేస్తున్నారని ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి తెలిపారు.
కారుణ్య నియామకాల పేరుతో కార్మిక వారసత్వ ఉద్యోగాలు, కోల్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాలు అందించారని కొనియాడారు. వేసవికాలంలో కార్మికులను ఎండ తీవ్రత నుంచి తట్టుకునేందుకు సింగరేణి వసతిగృహాలలో ఏసీల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన సింగరేణి ఉద్యోగుల ప్రమోషన్లకు దారి తీసిన ఘనత గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షురాలు కవితకు దక్కుతుందన్నారు. తమ నాయకురాలు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని భగవంతుని కోరుతున్నట్లు శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి కోరుకున్నారు.