మంచిర్యాల జిల్లా కేంద్రం పరిధిలో రూ. 50 లక్షల వ్యయంతో రహదారులను శుభ్రపరిచే యంత్రాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సులభంగా శుద్ధి చేయడం కోసం ఈ యంత్రం ఉపయోగపడుతుందని అన్నారు. పురపాలక సభ్యుల కోరిక మేరకు కొనుగోలు చేశామని తెలిపారు.
మన పట్టణం మన శుభ్రత పేరుతో ఇపుడు పాలక పరిధిలోని ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని దివాకర్ రావు కోరారు. పట్టణ వాసులు రహదారులపై చెత్తాచెదారాన్ని వేయరాదని... చెత్త డబ్బాలను వాడాలని అని సూచించారు.
ఇదీ చదవండి: భారత్- చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ