పట్టణాల అభివృద్ధి కోసమే కేసీఆర్ సర్కార్ పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన పట్టణ ప్రగతి రెండో విడత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
మంచిర్యాలలోని పలు కాలనీలను సందర్శించిన దివాకర్ రావు.. సమస్యలపై ఆరా తీశారు. కాలనీల్లో మురుగు కాలువల్లో నిల్వ ఉన్న మురుగు నీటిని తరలించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశమున్నందున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
- ఇదీచూడండి : 40 మంది విద్యార్థులపై కత్తితో దాడి