కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటింటి సర్వేను మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పరిశీలించారు. ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరోనా ప్రబలకుండా తొలిదశలోనే ఔషదాలను అందిస్తున్నారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ జ్వర సర్వేకు సహకరించాలని శాసనసభ్యులు దివాకర్ రావు కోరారు. ప్రభుత్వం కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఎంతగానో కృషి చేస్తుందని, కరోనా అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు చేస్తూ సరైన మందులు అందిస్తుందని తెలిపారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి... శరీర ఉష్ణోగ్రతలతో పాటు, వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడం కోసమే ఇంటింటి ఈ సర్వే ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు.
ఇవీ చదవండి: కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్