కుటుంబాన్నంతా పొట్టనబెట్టుకుని... తననూ బలితీసుకునేందుకు వచ్చిన డెంగీని జయించిన చిన్నారిని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు చూశారు. బాబుకు ఉచితంగా వైద్యం అందించిన శ్రీమహాలక్ష్మీ ఆస్పత్రి వైద్యుడు కుమార్ వర్మను ఎమ్మెల్యే సన్మానించారు. కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారిపై మానవతా దృక్పథం చూపిన ఆసుపత్రి సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో బాబుకు కావల్సిన అవసరాలను అందిస్తానని దివాకర్‌రావు హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా