మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేయూత అందించారు. పట్టణంలోని బాధితులను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. స్థానిక తెరాస నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సరుకులను బుధవారం పంపిణీ చేశారు.
కరోనా సోకితే ఎవరూ అధైర్య పడొద్దని, సాయం చేయడానికి తాము ఉన్నామని భరోసానిచ్చారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. లాక్డౌన్కు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొత్త వేరియంట్లపై టీకాల సత్తా ఎంత?