మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. సింగరేణి రక్షణ సిబ్బంది, సీఐఎస్ఎఫ్, పోలీసులతో పాటు విద్యార్థులు హాజరై అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
జాతీయగీతం పాడుతూ గౌరవ వందనం సమర్పించారు. విధి నిర్వహణలో అమరులైన సైనికుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.