రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శాసనసభ్యులు దివాకర్ రావు ప్రారంభించారు. పట్టణంలోని పలు వార్డుల్లో మహిళలు భౌతిక దూరం పాటిస్తూ చీరలను తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.
18 ఏళ్లు దాటిన లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో చీరలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. కరోనా విపత్కర సమయంలో ఉపాధి కోల్పోయి నిరుపేదలు మరింత దీనస్థితిలో ఉన్నారని.. పండగ పూట వారి మోములో బతుకమ్మ చీరలు ఆనందాన్ని నింపుతాయని ఎమ్మెల్యే అన్నారు.
ఇవీ చూడండి: త్రివేణి జల సవ్వడులతో... జిల్లాలో పచ్చని పంటలు