ETV Bharat / state

గుంతలమయమైన రోడ్లు.. పట్టించుకోని అధికారులు..!

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య నానాటికీ పెరుగుతోంది. గుంతలమయమైన రోడ్లతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఎంత మొరపెట్టుకుంటున్నా అధికారుల నుంచి స్పందన కరవైంది. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు చేపడుతున్న నామమాత్రపు చర్యలతో పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఈ సమస్యల నుంచి తమకు విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు జిల్లా కేంద్రంలో నివసిస్తున్న ప్రజలు.

problems with bypass road
problems with bypass road
author img

By

Published : Apr 25, 2021, 8:26 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో జనాభాతో పాటు ట్రాఫిక్ సమస్యా రోజురోజుకూ పెరుగుతోంది. భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు వాటిని బైపాస్ రోడ్డుకు మళ్లించారు. ఫలితంగా నిత్యం రద్దీగా మారిన బైపాస్‌రోడ్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మాత్రం నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిత్యం భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా తయారయ్యాయి. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలో సుమారు లక్షా 20 వేల జనాభా నివసిస్తున్నారు. బైపాస్‌రోడ్డు చుట్టుపక్కల సంజీవయ్య కాలనీ, గౌతమినగర్, రాళ్లపేట, రెడ్డి కాలనీ, లక్ష్మీనగర్ తదితర కాలనీలు ఉన్నాయి. ఆయా కాలనీల ప్రజలు ఏ పని కోసమైనా బైపాస్ రోడ్డు మీదుగానే జిల్లా కేంద్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుంతల రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గుంతలు పడిన రహదారిని అధికారులు ప్యాచ్ వర్క్‌లతో మూసివేస్తున్నారు. ఫలితంగా కొద్దిరోజులకే రోడ్లు మళ్లీ యథాతథ స్థితికి చేరుకుంటున్నాయి.

సమస్యను పరిష్కరించండి..

మరోవైపు బైపాస్ రహదారి మంచిర్యాల పురపాలిక పరిధిలో ఉండటంతో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో మూడు కిలోమీటర్ల మేర అధికారులు 100 మీటర్లతో రెండుచోట్ల సిమెంటు రహదారులను వేశారు. మధ్యలో మొక్కల పెంపకం కోసమని డివైడర్‌లను ఏర్పాటు చేయడంతో రహదారి ఇరుకుగా మారిందని.. దీంతో భారీ వాహనాలు వస్తే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి బైపాస్ రోడ్డు సమస్య తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి బైపాస్ రోడ్డుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి.. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: రాబోయే ఎన్నికల్లో భాజపాదే గెలుపు: తరుణ్​ చుగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.