సమృద్ధిగా పండిన పంటను అమ్మిన డబ్బులతో పాత వస్తువులను తొలగించి నూతన వస్తువులకు స్వాగతం పలకడమే భోగి పండుగ విశిష్టత అని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన భోగి వేడుకలలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన పండుగల విశిష్టతను తెలిపే కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. బతుకమ్మ పండుగ దేశవిదేశాలకు తెలియజేసిన జాగృతి అధ్యక్షురాలు కవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతిని పురస్కరిచుకుని ప్రజలందరు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.
ఇదీ చదవండి: భోగి మంటల అర్థం, పరమార్థం ఏంటీ..?