మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లైయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో జూలై నెల నుంచి 'హోప్ ఫర్ సైట్' సంస్థ ఆధ్వర్యంలో కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. పేద రోగుల కోసం లక్ష్మీ గోపీనాథం చేస్తున్న ప్రయత్నాన్ని కొనియాడారు.
దేశంలో ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తానని లక్ష్మీ గోపీనాథం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఛైర్మన్ రాజారావు, వైస్ ఛైర్మన్ నారాయణరెడ్డి, కార్యదర్శి వినోద్, లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుఎర్ర సువర్ణ, డాక్టర్ సందీప్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం