చట్టబద్ధత లేని లంబాడీ కులస్తులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివాసీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి వారి హోదా రద్దు చేయాలని కోరారు. గత నాలుగేళ్ల నుంచి రాజ్యాంగ బద్దంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు విన్నవించినా సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసీలు సాగుచేస్తున్న పోడు భూములకు భూ హక్కు పత్రాలు కల్పించి, ఆదివాసీ గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని, నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను నేరవేర్చలేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కారాగారం