ETV Bharat / state

Singareni: జాతీయ స్థాయిలో సింగరేణి ప్రతిభ - Singareni national record

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చింది. ఏప్రిల్ నెలలో నెలవారీ పీఎల్ఎఫ్ సాధనలో 98.57 శాతం సాధించి జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం, మొదటి త్రైమాసికంలో మరో స్థానం ఎగబాకి 6వ స్థానంలో నిలిచింది.

Singareni
సింగరేణి
author img

By

Published : Jul 10, 2021, 3:35 PM IST

మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (Singareni Thermal Power Station) మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభ చాటుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో 92.49 సగటు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధించి జాతీయస్థాయిలోని 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. గత ఏప్రిల్ నెలలో నెలవారీ పీఎల్ఎఫ్ సాధనలో 98.57 శాతం సాధించి జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం, మొదటి త్రైమాసికంలో మరో స్థానం ఎగబాకి 6వ స్థానంలో నిలిచింది.

ఏప్రిల్ నెలలో 98.57 శాతం పీఎల్ఎఫ్... మే నెలలో 89, జూన్ నెలలో 90 శాతం పీఎల్ఎఫ్ సాధించి సగటున త్రైమాసికంలో 92.49 పీఎల్ఎఫ్​తో దేశంలో 6వ స్థానంలో నిలిచింది. గత 3 నెలల కాలంలో ఈ ప్లాంట్ 2,424 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేయగా... దీనిలో 2,283 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను రాష్ట్ర అవసరాలకు సరఫరా చేసింది.

గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ. 711 కోట్ల అమ్మకాలు జరిపిన సీఎండీ ఎన్ శ్రీధర్ సంబంధిత అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఇక ముందు కూడా మంచి పీఎల్ఎఫ్​తో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అవసరాలు తీర్చడంలో తమ వంతు బాధ్యత నిర్వహించాలని కోరారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నూరు శాతం పీఎల్ఎఫ్​ను ఇప్పటికి మూడు సార్లు సాధించింది. 2018లో సెప్టెంబర్ నెలలోనూ, 2019లో ఫిబ్రవరి నెలలో అలాగే 2020 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఈ కేంద్రం నూరు శాతం పీఎల్ఎఫ్ సాధించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గల రెండు యూనిట్లు ఇప్పటికి 15 సార్లు నూరు శాతం పైబడి పీఎల్ఎఫ్ సాధించాయని సింగరేణి సంస్థ వెల్లడించింది.

ఇదీ చదవండి: కీలక నిర్ణయం: నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తి నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.