మహారాష్ట్ర నుంచి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోకి అక్రమంగా తీసుకువస్తున్న 60 లీటర్ల నిషేధిత గ్లైఫోసైట్ (గడ్డిమందు)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో గడ్డిమందును తరలిస్తున్నట్టు గుర్తించారు.
దాని విలువ సుమారు రూ. 25,410 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..