ETV Bharat / state

భారత జట్టులో చోటే లక్ష్యంగా కష్టపడాలి: అజారుద్దీన్​

author img

By

Published : Mar 15, 2021, 2:53 AM IST

నేటి యువత సెల్​ఫోన్ మోజులో పడి క్రీడలను మరిచిపోతున్నారని దీంతో మానసికంగా ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హెచ్​సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలో కొక్కిరాల రఘుపతిరావు స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్​ను ఆయన ప్రారంభించారు.

HCA president  azaruddin started cricket tournament in mancherial district today
భారత జట్టులో చోటే లక్ష్యంగా కష్టపడాలి: అజారుద్దీన్​

మంచిర్యాలలో ఏఐసీసీ సభ్యులు ప్రేమ్​ సాగర్​ రావు నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్​ అధ్యక్షుడు అజారుద్దీన్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

దాదాపు 350 జట్లు పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నెల రోజులపాటు టోర్నమెంట్​ నిర్వహించనున్నారు. గ్రామాల్లో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అనేక మంది ఉన్నారన్న అజారుద్దీన్.. భారత జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని క్రీడాకారులకు ఆయన సూచించారు.

ఇదీ చూడండి: రేపట్నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.