మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షురాలు స్వర్ణలత, ఎంపీటీసీ, సర్పంచులు, ఆయా సంబంధిత ప్రభుత్వ అధికారులు భేటీలో పాల్గొన్నారు. హాజీపూర్ మండలంలోని 17 పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో చర్చించారు. గ్రామాలలో పలు అభివృద్ధి పనుల కోసం సమీక్షించారు.
గ్రామీణ నీటి సరఫరా, విద్యుదీకరణ, మిషన్ భగీరథ, ప్రాథమిక ఆరోగ్య, రహదారుల అభివృద్ధిపై కృషిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. నూతనంగా ఏర్పడిన తమ హాజీపూర్ మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని 15 రకాల అంశాలపై తమ సర్వసభ్య సమీక్ష సమావేశం జరిగిందని అధ్యక్షురాలు స్వర్ణలత తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ