ETV Bharat / state

'తెలంగాణలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం' - మంచిర్యాల జిల్లాలో పోలీస్​స్టేషన్​ను ప్రారంభించిన ప్రభుత్వ విప్​ బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పోలీస్​స్టేషన్​ భవనాన్ని ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ ప్రారంభించారు. దేశంలోనే రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందని ఆయన కొనియాడారు.

govt vip  Balka Suman inaugurating the police station building in macherial dist
పోలీస్​స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన బాల్క సుమన్
author img

By

Published : Dec 29, 2020, 5:33 PM IST

దేశంలోనే రాష్ట్ర పోలీసులు పనితీరులో ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్​ బాల్కసుమన్ ప్రశంసించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన నూతన పోలీస్​స్టేషన్​ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం ఠాణా ఆవరణలో మొక్కలు నాటారు. రాష్ట్రప్రభుత్వం పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీ ఛైర్మన్​ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పోలీసులకు హిజ్రాల సన్మానం.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.