ETV Bharat / state

Ganja Gang Arrest in Mancherial : ఇటుకల లోడు మాటున 465కిలోల గంజాయి.. ​ - తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా

Ganja Smuggling in Mancherial : ఇటుకలలోడ్​ మాటున ట్రాక్టర్​లో ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసి.. 93 లక్షల రుపాయల విలువ చేసే 465 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Ganja Smuggling in Telangana
Ganja Smuggling in Mancherial
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 6:43 PM IST

Ganja Smuggling in Telangana : తెలంగాణలో సరిహద్దు జిల్లాలు గంజాయి అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. పోలీసులకు కంటపడకుండా ఉండేందుకు స్మగ్లర్లు రవాణాకు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. తాజాగా ఇటుకలలోడ్​ మాటున గంజాయి(Ganja Smuggling) అక్రమ రవాణా చేస్తున్న ముఠాను మంచిర్యాల జిల్లా పోలీసులు(Manchirial District Police) అరెస్టు చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా ఇటుకలలోడ్​ మాటున ట్రాక్టర్​లో గంజాయి తరలిస్తున్న ముఠాను శ్రీరాంపూర్ పోలీసులు పట్టుకున్నారు.

Hyderabad Ganja Gang Arrested : హైదరాబాద్​లో గంజాయి గ్యాంగ్​ అరెస్ట్​.. నిందితుల్లో మైనర్​

Mancherial Latest News : స్మగ్లర్లు ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ట్రాక్టర్లో సిమెంట్​ ఇటుకలను తరలిస్తున్నట్లుగా ఏర్పాట్లు చేసి.. అందులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు రామగుండం సీపీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లాకు చెందిన నిందితులు.. అక్కడి చుట్టు పక్కల గ్రామాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. మహారాష్ట్రకు తరలించి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు.

గంజాయిని తరలిస్తుండగా మార్గ మధ్యలో.. 23వ తేదీ రాత్రి వేళ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ సింగరేణి జీఎం కార్యాలయం వద్ద ట్రాక్టర్​ టైర్​ పంక్చర్​ కావడంతో రోడ్డుపైనే నిలిపేసినట్లు సీపీ పేర్కొన్నారు. రాత్రివేళ విధుల్లో ఉన్న మంచిర్యాల ఎస్సై.. పరిశీలించగా ఇటుకలలో గంజాయి దొరికినట్లు తెలిపారు. మొత్తంగా 465 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం స్పెషల్​ టీమ్​గా ఏర్పడి.. ఒడిశాలోని మల్కాన్​గిరిలో పర్యటించగా.. స్థానిక పోలీసుల సహకారంతో అసలు రహస్యం బహిర్గతమయినట్లుగా తెలిపారు.

Ganja Gang Arrest in Mancherial : గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్​ డ్రైవర్​ జగబందు, వాహన యజమాని చిత్రసేన్​లను అదుపులోకి తీసుకుని విచారించగా.. గురు, ఈశ్వర్​ అనే ఇద్దరు వ్యక్తులు అసలు సూత్రధారులుగా తేలిందన్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారన్నారు. వీరందరూ గతంలో కూడా ఈ విధంగానే గంజాయి రవాణా చేసినట్లు.. నిజం ఒప్పుకున్నారని సీపీ వివరించారు. మిగతా ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు.

"ఇటుకలలోడ్​ మాటున ట్రాక్టర్​లో ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నాము. ఈ ఘటనలో 93 లక్షల రుపాయల విలువ చేసే 465 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. మంచిర్యాల జిల్లా పోలీసులు టాస్క్​ఫోర్స్​ బృందంగా ఏర్పడి.. ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లాలో పర్యటించి అసలు నిందితులను గుర్తించాము. ఈ గంజాయి అక్రమ రవాణాలో సూత్రాధారులైన గురు, ఈశ్వర్​ అనే ఇద్దరు వ్యక్తలు పరారీలో ఉన్నారు. వారిని త్వరలో పట్టకుంటాము". - రెమా రాజేశ్వరి, మంచిర్యాల పోలీస్ కమిషనర్​

Ganja Gang Arrest in Mancherial ఇటుకల లోడు మాటున గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్​

Ganja supply gang arrest in Hyderabad : ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా.. ముఠా అరెస్టు

Ganja gang arrested in Cyberabad : సైబరాబాద్​లో భారీగా గంజాయి పట్టివేత.. విలువ ఎంతంటే?

ganja cultivation in Hyderabad : ఏం తెలివి బాసూ.. ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.