వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వరి పంట కోసి కుప్పలుగా పోసి ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మండలంలో మూడు కొనుగోలు కేంద్రాలు ఉన్నా.. ఇప్పటి వరకు కొన్ని లారీలను మాత్రమే పంపించారని తెలిపారు.
వర్షాలు పడే లోపల ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. డీఏవో దిలీప్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కారుకూరి రాంచందర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మిడతల దండుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష