మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నేన్నల మండలానికి చెందిన యువరైతు సాయికుమార్ ఆత్మహత్యకు యత్నించాడు. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న తమ భూమిని మందమర్రి పట్టణానికి చెందిన వ్యక్తి తన పేరు మీద పట్టా చేయించుకున్నారని తెలిపాడు. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశాడు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీసులు.. సాయికుమార్‌ను ఏవో సురేష్ వద్దకు తీసుకెళ్లారు. సాధ్యమైనంత వేగంగా సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఏవో తెలిపారు.
ఇవీ చూడండి: దేశమంతా హై అలర్ట్.. కశ్మీర్‌కు మరిన్ని బలగాలు