ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం.. ఐదుగురికి పాజిటివ్

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఐదుగురు కొవిడ్ బారిన పడ్డారు.

bellampalli mro office employees tested corona positive, bellampalli mro office
తహసీల్దార్ కార్యాలయంలో కరోనా, తహసీల్దార్ సిబ్బందికి కొవిడ్
author img

By

Published : Apr 19, 2021, 2:58 PM IST

రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఐదుగురు అధికారులకు వైరస్ నిర్ధరణ అయింది. ఆర్ఐతో పాటు ఒక వీఆర్వో, ముగ్గురు వీఆర్ఏలకు కరోనా పాజిటివ్​గా తేలడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐదు రోజుల క్రితం ఆర్ఐకి కరోనా పాజిటివ్ అని తేలగా... మిగిలిన సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. వారిలో నలుగురికి కొవిడ్ నిర్ధరణ అయింది. కేసులు పెరుగుతున్న వేళ సిబ్బందితో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కుమారస్వామి సూచించారు. కార్యాలయంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయడంతో పాటు కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణపై కొవిడ్ పంజా.. 39,154 యాక్టివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.