మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ తన 14 నెలల కుమార్తె రితిక రాజ్‌ను పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. ఈ నెల 19 నుంచి రాహుల్ రాజ్ తల్లి జ్యోతిక క్రమం తప్పకుండా రితకను అంగన్వాడీకి తీసుకొస్తున్నారు. రితిక కూడా తోటి పిల్లలతో సరదాగా ఆటలు ఆడుతోంది. సబ్ కలెక్టర్ తన బిడ్డను అంగన్వాడీ కేంద్రానికి పంపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
ఇవీ చూడండి: నక్సలైట్ల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి