చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు హామీలు ఇస్తారు. కానీ అందుకు భిన్నంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్‌గా భాజపా నుంచి పోటీ చేసి గెలిచిన అగల్ డ్యూటి రాజ్ ప్రమాణ స్వీకరణ అనంతరం తనను గెలిపించిన వార్డు ప్రజల దగ్గరికి వెళ్లి నెలకొన్న సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
మున్సిపాలిటీకి చెల్లించే పన్నుల ప్రతీ లెక్కనూ బోర్డు ఏర్పాటు చేసి వార్డు ప్రజలకు తెలియజేస్తానని తెలిపారు. గత పాలకవర్గంలో తాను చేయని పనుల వివరాలు తెలియజేశారు.
ఇవీ చూడండి: నేరేడుచర్లలో నేడైనా.. జరిగేనా ఎన్నిక...