సింగరేణిలో కరోనా ప్రమాద ఘంటికలు మోగాయి. మంచిర్యాల జిల్లా సింగరేణి కార్మిక క్షేత్రంలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మందమర్రి పరిధి రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఈరోజు 198 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. వారిలో 62 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కార్మికలోకం భయాందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా ఇదే స్థాయిలో పాజిటివ్ కేసులు రావడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈరోజు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్మికులు కరోనా పరీక్షలు చేసుకునేందుకు పోటీపడ్డారు.
ఇదీ చూడండి : చైనాకు వ్యతిరేకంగా పీఓకేలో భారీ కాగడాల ర్యాలీ