ETV Bharat / state

కరోనా కరాళ నృత్యం.. ఒక్క జులైలోనే 584 కేసులు

మంచిర్యాల జిల్లాలో కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. జిల్లావ్యాప్తంగా మహమ్మారి బాధితుల సంఖ్య 875కు చేరగా.. ఒక్క జులైలోనే 584 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మొదట బెల్లంపల్లి ఐసోలేషన్​ కేంద్రంలో మాత్రమే పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ యాంటీజెన్​ కిట్లతో పరీక్షలు చేపట్టడం వల్ల వైరస్ బయటపడుతోంది.

కరోనా కరాళ నృత్యం.. ఒక్క జులైలోనే 584 కేసులు
కరోనా కరాళ నృత్యం.. ఒక్క జులైలోనే 584 కేసులు
author img

By

Published : Aug 7, 2020, 8:11 AM IST

మంచిర్యాల జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క జులై నెలలోనే 584 కేసులు నమోదు కావడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలోని హాజీపూర్ మండలంలో తొలి కేసు మే 5న నమోదు కాగా, మే 14న చెన్నూర్​లో తొలి కరోనా మరణం సంభవించింది. మూడు నెలల కాలంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య ఊహించనంతగా పెరిగాయి.

మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో మాత్రమే పరీక్షలు చేపట్టిన ప్రభుత్వం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ యాంటీజెన్ కిట్లతో పరీక్ష చేయడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 14 మంది మృతి చెందారు.

జులై చివరి వారంలోనే 289 కేసులు:

మంచిర్యాల జిల్లాలో జులై నెలలో మహమ్మారి తీవ్రమైంది. రెండో వారంలో కేసులు తగ్గగా నాలుగో వారంలో కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయాయి. జులై మొదటి వారంలో 64, రెండో వారంలో 53, మూడో వారంలో 178, చివరి వారంలో 289 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు మొదటి వారంలోనే 181 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 875కు చేరింది.

* ఇది జిల్లాలో నెలల వారిగా కేసుల పరిస్థితి

నెలకరోనా కేసుల సంఖ్య
మే 36
జూన్74
జులై584
ఆగస్టు (మొదటి వారం) 181

ఇవీ చూడండి: నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.