మంచిర్యాల పట్టణంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని దివాకర్‌రావు ఎందుకు ఉపయోగించడం లేదని భాజపా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు ప్రశ్నించారు. భవనం ప్రారంభించి ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు.
క్యాంపు కార్యాలయ ముందు పార్టీ శ్రేణులతో నిరసన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలతో నిర్మించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కారణమేంటో ఎమ్మెల్యే చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలని బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు దగ్గర కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మించిందన్నారు. ఎమ్మెల్యే ఇక్కడ ఉండకపోవడానికి కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. భవనం అవసరం లేకుంటే మరో శాఖకు ఇవ్వాలని సూచించారు.
ఇదీ చూడండి: కొత్తగా 3,59,000 రేషన్ కార్డులు ఇచ్చాం: గంగుల