మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. మందమర్రి, రామకృష్ణాపూర్ పురపాలికల్లో పర్యటించిన బాల్క సుమన్... పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. బొక్కలగుట్ట గ్రామంలో 3 కోట్ల 86 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన వంతెన, చెక్ డ్యామ్, రహదారిని ప్రారంభించారు.
మందమర్రి మున్సిపాలిటీ కార్యాలయంలో కోటీ 18 లక్షల 80 వేలతో 24 స్వచ్ఛ్ ఆటోలను, పది లక్షల రూపాయలతో నూతన ట్రాలీ, వాటర్ ట్యాంకర్ను ప్రారంభించారు. అనంతరం టీబీజీకేఎస్ కార్యాలయంలో మే డే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. తహసీల్ధార్ కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కాతన్పల్లి మున్సిపల్ కార్యాలయంలో కోటీ 5 లక్షల 60 వేలతో 18 స్వచ్ఛ్ ఆటోలు, 18 లక్షల రూపాయలతో నూతన ట్రాక్టర్, ట్యాంకర్ను ప్రారంభించారు.