ETV Bharat / state

'అంబేడ్కర్​ ఆశయాలను భావితరాలకు అందించాలి' - మంచిర్యాల జిల్లా నస్పూర్​లో అంబేడ్కర్​ విగ్రహానికి నివాళులు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ వర్ధంతిని పురస్కరించుకుని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేత, ఎమ్మెల్యే దివాకర్​రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేశారు.

Ambedkar's aspirations must be passed on to the future says peddaplli mp in mancherial dist
'అంబేద్కర్​ ఆశయాలను భావితరాలకు అందించాలి'
author img

By

Published : Dec 6, 2020, 5:16 PM IST

అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్​ పురపాలికలోని చౌరస్తాలో విగ్రహానికి ఎంపీ వెంకటేశ్​ నేత, ఎమ్మెల్యే దివాకర్​రావు పులమాలలు వేసి నివాళులర్పించారు. భవిష్యత్​ తరాలకు ఆయన ఆశయాలను అందించాలని అన్నారు. బడుగు వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ఎంపీ కొనియాడారు.

మహిళ సమానత్వ చట్టాలు, హక్కుల కోసం ఆయన పోరాడారని తెలిపారు. దేశంలో నీటిపారుదల, విద్యుత్​ ప్రాజెక్టుల రూపకల్పన చేశారన్నారు. ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి, దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించి పేద ప్రజలకు అండగా నిలిచారని ఎమ్మెల్యే దివాకర్​రావు వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం.. భవిష్యత్తుపై దిశానిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.