ETV Bharat / state

సింగరేణి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరాహారదీక్ష - singareni

మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి జీఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. సింగరేణి కార్మికుల ప్రధాన 6 డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్​ చేశారు.

aituc leaders hunger strike for singareni employees demands in manchirial district
సింగరేణి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరాహారదీక్ష
author img

By

Published : Sep 15, 2020, 6:11 PM IST

సింగరేణి కార్మికుల ప్రధాన 6 డిమాండ్లను పరిష్కరించాలంటూ మంచిర్యాల జిల్లా మందమర్రి జీఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఈ దీక్షలను ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు.

గత ఏడాది సింగరేణి గడించిన లాభాలు ప్రకటించి.. కార్మికులకు ఎంత వాటా చెల్లిస్తున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు. మార్చి నెలలో కోత విధించిన 50% వేతనాన్ని తిరిగి చెల్లించాలన్నారు. కరోనా బాధితులతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి కూడా ప్రత్యేక సెలవులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారందరిని అన్​ఫిట్​ చేసి వాళ్ల వారసులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: విద్యుత్​ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.