మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తెరావు పల్లెలో కరోనా కలకలం రేగింది. కొవిడ్-19 లక్షణాలతో ఓ మహిళ మృతిచెందింది. మృతిచెందిన మహిళ నస్పూర్ మండలం శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌లో వివాహ వేడుకకు హాజరై.. అక్కడే రెండు రోజులు గడిపినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఇంటింటా సర్వే నిర్వహించారు. 25 కుటుంబాలకు చెందిన 79 మందిని స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలని సూచించారు. లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: టిక్‌టాక్‌లో లైకులు రావట్లేదని ఆత్మహత్య!