మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నజీర్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతలో పడి ఐదేళ్ల బాబు రిశ్వంత్ మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి.. ప్రమాదకరంగా ఉన్న గుంతను గమనించక అందులో పడ్డాడు.
ఎక్కడికెళ్లాడోనని కుటుంబసభ్యులు వెతకగా.. అపస్మారక స్థితిలో చిన్నారి కనిపించాడు. హుటాహుటిన మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే బాలుడు మృతి చెందాడు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కుమారుడు అచేతనంగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.