మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. జిల్లాలో తాజాగా 22 మందికి కరోనా పరీక్షలు చేయగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. మంచిర్యాల పట్టణంలో 9, నస్పూర్లో 4, జైపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ పట్టణాలలో ఒక్కొక్కరు చొప్పున వైరస్ బారిన పడ్డారు.
కరోనా బాధితులందరినీ బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 58 యాక్టివ్ కేసులు ఉన్నాయని... 111 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారని నోడల్ అధికారి బాలాజీ తెలిపారు.
ఇదీ చూడండి: నేను ఆసుపత్రిలో ఉండను.. కరోనా బాధితుడి హల్చల్