మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని మావోయిస్టు సానుభూతిపరులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఏసీపీ బాలు యాదవ్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మావోలు ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 కౌంటర్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇవీ చూడండి:వీళ్లు పోటీకి దూరం- వాళ్లకు విజయం దూరం