ETV Bharat / state

డైట్‌ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద మృతి.. గుట్టపై ఏం జరిగింది? - young woman died under suspicious circumstances.

ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నగరంలోని అయ్యప్ప గుట్టపై ఓ యువతి శవం ఉన్నట్లు సమాచారం అందగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

young woman died under suspicious circumstances.
యువతి అనుమానస్పద స్థితిలో మృతి..
author img

By

Published : Sep 3, 2021, 10:45 AM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప గుట్టపై శవమై కనిపించిన యువతి నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కావ్య (20)గా గుర్తించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని మల్లెబోయినపల్లి దగ్గర ఉన్న టీటీసీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సంఘటన స్థలంలో విద్యార్థిని చెట్టుకు ఉరి వేసుకుని ఉన్న ఆనవాలను పోలీసులు గుర్తించారు.

బుధవారం విద్యా సంస్థలు పునః ప్రారంభం కావడంతో ఆమె గురువారం ఇంటి నుంచి హాస్టల్‌కు వచ్చారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప గుట్టపై చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతి తండ్రి రాంజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిందా.. లేదా ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడ దీశారా.. అన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తుందని చెప్పారు. కారణాలు కూడా ఏమీ తెలియడం లేదని తెలిపారు.

ఇదీ చదవండి: Hyderabad Traffic: వాన పడితే వణుకుతున్న వాహనదారులు.. కారు పూలింగే పరిష్కారమా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.