మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రహదారిపై రాత్రి వేళలో నడుచుకుంటూ వెళ్లిన అతన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి : మనసు దోచేస్తున్న మంచు తెరలు